టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో సామ్ అతిథి పాత్ర కూడా పోషించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మే 9న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. తన హోమ్ బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో సమంత కూడా చాలా యాక్టివ్‌గా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
Also Read: Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్
సమంతతో సహా సినిమాలో నటించిన నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. వైజాగ్ లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలు అన్నీ గుర్తు చేసుకుంది. ఇక్కడ ఈవెంట్ చేసిన ప్రతి సినిమా మంచి విజయం సాధించాయి, ‘శుభం’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్న అంటూ చెప్పుకొచ్చింది. మూవీ చూశాక అందరు కూడా చిరు నవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొన్నారు.
Also Read : Rashmika : మనిషిలో మార్పు సహజం.. ఎవరిని గుడ్డిగా నమ్మకండి
అలాగే దాదాపు ఈ మూవీలో చాలా వరకు కొత్త వారినే తీసుకున్నారు. దీంతో ప్రతి ఒక్క ఈ మూవీ గురించి వారి అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ రాజ్ అండ్ డీకే కారణంగానే ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. స్టోరీ చెప్పినప్పుడే పడి పడి నవ్వుకున్నాను, హారర్ కామెడీని ఇలా కూడా తియ్యొచ్చా అనుకున్నాను. అండ్ సమంత మామ్ ఐ లవ్ యూ.. మీరు బాగా సపోర్ట్ చేశారు’ అని చెప్పగా.. సామ్ నవ్వేసింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
