Site icon NTV Telugu

Samantha : ఎప్పుడూ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

Whatsapp Image 2024 05 03 At 10.26.04 Am

Whatsapp Image 2024 05 03 At 10.26.04 Am

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే గత ఏడాది శాకుంతలం ,ఖుషి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత ఆ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తానే నిర్మాతగా “మా ఇంటి బంగారం” అనే సినిమాలో నటిస్తుంది.రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.

అలాగే సమంత గత ఏడాది హిందీలో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఏదోక పోస్ట్ పెడుతూ ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతుంది. ‘మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి’ అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంతది వృషభ రాశి కావడం విశేషం.వృషభం అంటే ఎప్పటికీ వెనకడుగు వేయని మనస్తత్వం.దీనితో ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Exit mobile version