Site icon NTV Telugu

Samantha : తనతో నా బంధానికి ఎలాంటి పేరు పెట్టలేను..

Samantha

Samantha

కొంత మంది హీరోలు కావచ్చు హీరోయిన్‌లు కావచ్చు ఫామ్‌లో ఉన్న లేక పోయిన వారీ క్రేజ్ మాత్రం తగ్గదు. ఇందులో సమంత ఒక్కరు. ‘ఏమాయ చేశావే’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ‘ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనకు తెలిసిందే. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. అనంతరం ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇలా వెంట వెంటనే దెబ్బ మీద దెబ్బ పడటంతో సమంత చాలా సఫర్ అయింది. దీంతో సినిమాలు చేయడం కూడా తగ్గించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ అమ్మడు తిరిగి ఫామ్ లోకి వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ వ్యక్తి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: NTR, Neel : నక్క తోక తొక్కిన మమిత బైజు.. భారీ ఆఫర్ కొట్టేసింది‌గా !

ఆ వ్యక్తి మరెవరో కాదు హీరో రాహుల్ రవీంద్రన్.. వీరిద్దరు బయట ఎంతో క్లోజ్‌గా ఉంటారో మనకు తెలిసిందే. అయితే చెన్నైలో ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన కోలీవుడ్‌ గోల్డెన్‌ క్వీన్‌ పురస్కారాల్లో సమంత గోల్డెన్‌ క్వీన్‌గా అవార్డునందుకుంది. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నేను పడిన కష్టానికి ఫలితంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్న, వాళ్లు నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా. కెరీర్‌తో పాటు కష్టకాలంలో వెన్నంటి వున్న ఆత్మీయుల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. కేవలం ఏదో ఒక తప్పుడు నిర్ణయం వల్ల కెరీర్‌ ప్రభావితం అవుతుందన్నది అబద్ధం, సరైన అవగాహన లేకుండా తీసుకునే ఎన్నో నిర్ణయాలు కెరీర్‌ గమనాన్ని నిర్ధేశిస్తాయి. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఎంతో కేర్‌ తీసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. కష్టకాలంలో రాహుల్‌ నావెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు లేదా రక్త సంబంధీకుడా అని చెప్పలేను. ఎందుకంటే అంతటి బలమైన అనుబంధం మాది’ అని సమంత పేర్కొంది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version