NTV Telugu Site icon

ప్రామిస్ నెరవేర్చిన సామ్… ఫీమేల్ ఆటో డ్రైవర్ కు బహుమతిగా కారు…!

Samantha Akkineni keeps her promise and gifts a car to a female auto driver

సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న అగ్ర నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఓ ఫిమేల్ ఆటో డ్రైవర్ కు కారును బహుమతిగా ఇచ్చి గతంలో తాను చేసిన ప్రామిస్ ను నిలుపుకున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ‘సామ్ జామ్’ అనే షోను సమంత హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కవిత అనే గృహ హింసకు గురైన ఫిమేల్ ఆటో డ్రైవర్ ను కలుసుకున్నారు సమంత. ఆమె దుస్థితిని గురించి తెలుసుకున్న సామ్ ఆమెకు కారును బహుమతిగా ఇస్తానని ప్రామిస్ చేసింది. చెప్పినట్లుగానే తాజాగా ఆ లేడీ ఆటో డ్రైవర్ కు సమంత రూ.12.5 లక్షల విలువైన కారును అందించింది. సామ్ ఉదారత మరికొంతమంది టాప్ నటీనటులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో సామ్ హీరోయిన్ గా నటిస్తోంది.