బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌తో పాటు, రాధే దిషా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 13 న ఇండియా సహా 40కి పైగా దేశాలలో థియేట్రికల్ గా విడుదలైంది. ఇండియాలో ఈ చిత్రం ZEE5 లో పే పర్ వ్యూ బేస్ లో విడుదలైంది. అంతేకాదు అన్ని ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది ఈద్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ‘రాధే’ విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళ రాకర్స్, టెలిగ్రామ్‌లలో లీక్ అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హెచ్‌డి క్వాలిటీలో లభిస్తుంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే పైరసీకి నో చెప్పాలంటూ సల్మాన్ కోరారు.
తమిళ్ రాకర్స్ లో ‘రాధే’ లీక్…!!
