Salman Khan: బాలీవుడ్ ‘సుల్తాన్’ సల్మాన్ ఖాన్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త ప్రస్తుతం బి-టౌన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత 52 ఏళ్లుగా (1974 నుంచి) ముంబయి బాంద్రాలోని ఐకానిక్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’లో ఉంటున్న సల్మాన్ ఖాన్.. త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఒక సరికొత్త విలాసవంతమైన నివాసంలోకి మారబోతున్నారు. ఈ సరికొత్త సీ-ఫేసింగ్ (సముద్రతీర) రాజప్రాసాదం విలువ అక్షరాలా రూ.350 కోట్లకు పైనే ఉంటుందని ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం సల్మాన్ ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు కూతవేటు దూరంలోనే, బాంద్రాలోని అత్యంత ఖరీదైన ‘చింబై’ ఏరియాలో ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చకచకా జరుగుతోంది. సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ పేరిట రిజిస్టర్ అయి ఉన్న సుమారు 11వేల చదరపు అడుగుల స్థలంలో ఈ సరికొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడున్న పాత రెండంతస్తుల బిల్డింగ్‌ను కూల్చివేసి, ఇప్పుడు గ్రౌండ్ + స్టిల్ట్ + 6 అంతస్తుల అత్యాధునిక బంగ్లాను ‘సచ్ డెవలపర్స్’ అనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తుంది. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA) నుంచి ఈ ప్రాజెక్టుకు తాజాగా అన్ని రకాల లైన్ క్లియరెన్స్ లభించింది. సల్మాన్ ఖాన్ సొంత అభిరుచికి తగ్గట్టుగా నిర్మిస్తున్న ఈ కొత్త ఇంట్లో అండర్ గ్రౌండ్ డబుల్ బేస్‌మెంట్ పార్కింగ్ (15 కార్ల సామర్థ్యం), ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, అత్యాధునిక జిమ్, సముద్రపు అందాలు కనిపించేలా సువిశాలమైన హాల్స్ ఉండబోతున్నాయని టాక్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’ రేంజ్‌ను మించేలా ఈ ఇల్లు ఉండబోతుందని సమాచారం.
అయితే ఈ లగ్జరీ ఇల్లు కట్టడం వెనుక కేవలం సౌకర్యాలే కాదు, అంతకుమించిన భద్రతా కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ భద్రతను ప్రభుత్వం ‘Y+’ కేటగిరీకి పెంచింది. గెలాక్సీ అపార్ట్‌మెంట్ బిజీగా ఉండే మెయిన్ రోడ్డుపై ఉండటం వల్ల అక్కడ భద్రతను పర్యవేక్షించడం సవాలుగా మారింది. కానీ ఈ కొత్త భవనం అత్యంత ప్రైవేట్, ప్రశాంతమైన బై-లేన్‌లో ఉండటం వల్ల సెక్యూరిటీ టీమ్స్ కట్టుదిట్టమైన నిఘా ఉంచడానికి, సల్మాన్ ప్రైవసీకి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే ఖాన్ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ కానుంది.

