Site icon NTV Telugu

Salim Akhtar : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మృతి..

Salim Akbar Bollywood

Salim Akbar Bollywood

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, హీరోలు, హీరోయిన్‌లు, ఇలా ఎవ్వరో ఒక్కరు అనారోగ్య సమస్యతో ప్రాణాలు వదిలేస్తున్నారు. బాలీవుడ్‌లో మొన్న ఓ ప్రముఖ దర్శకుడు మరణించగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ తుది శ్వాస విడిచారు. ఆయన (87) గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతు ముంబైలోని ధీరుబాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు ప్రకటించగా, నేడు సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి ప్రముఖ దర్శక నిర్మాతలతో పాటు.. నటీనటులు కూడా హాజరు కాబోతున్నారు.

Also Read: Sapthagiri : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం..

సినీ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన సలీమ్.. (1983) లో ఖయామత్, (1993) లో ఫూల్ ఔర్ అంగారే, ఆద్మీ (1993), రాజా కీ ఆయేగీ బారాత్ (1997) వంటి సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. అంతే కాదు అమీర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లను ఆయన సినిమాల ద్వారా పరిచయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు లెజెండ్ నిర్మాతనే చెప్పాలి. అలాంటి ఆయన చనిపోవడం ఇండస్ట్రీలోని ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. సలీమ్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ తన కుటుంబాన్ని ధైర్యం చెబుతున్నారు.

Exit mobile version