Site icon NTV Telugu

SaiDurghaTej : మావయ్య నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయిదుర్గ తేజ్!

Pavan

Pavan

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మావయ్య పవన్ అంటే సాయికి ఎంతో ప్రేమ. ఇటీవల మావయ్య దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ తేజ్ షేర్ చేశారు.

Also Read : AlluArjun : ‘పుష్ప-2’ ట్రైలర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!

సాయిదుర్గ తేజ్  మాట్లాడుతూ ” మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను అందుకున్న ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారుచేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన ఈ సావర ట్రైబ్ నేచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్స్ గీస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సావర తెగల వారి కళ అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా సావర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసి ప్రోత్సహించాలి. పవన్ కల్యాణ్ మావయ్య ఎవరికైనా బహుమతిగా కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సావర తెగల పెయింటింగ్స్ ఇస్తారు. మనమూ ఆ కృషిని, స్ఫూర్తిని కొనసాగించాలి. లేపాక్షి షోరూం సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఈ కళాకృతులు కొనుగోలు చేసుకోవచ్చు” అని పేర్కొన్నారు.

Exit mobile version