మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తి నా పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్నాడని నా దృష్టికి వచ్చింది. అతను నాతో పాటు సినిమాల్లో నటించిన వారి నుంచి, ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నట్టు తెలిసింది. నా వైపు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులతో సంభాషించకండి’ అంటూ తన అభిమానులను అలెర్ట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. అంతేకాదు ఇలాంటి సమయంలో అవసరమైన వారికి మా సహాయం పొందనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. అభిమానులు ఇలాంటి ఫ్రాడ్ ల నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ సుప్రీం హీరో ప్రస్తుతం రిపబ్లిక్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దేవాకట్టా దర్శకత్వంలో పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సాయి ధరమ్ తేజ్ పేరుతో చీటింగ్… హీరో ఫైర్…!
