ఇవాళ టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న పలువురిలో కొందరు డైరెక్ట్ గా స్టార్ హీరోల సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంటే మరి కొందరు మాత్రం ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి అంచెలంచెలుగా సూపర్ ఇమేజ్ సంపాందించుకున్నారు. ఈ రెండో కేటగిరికి చెందిన హీరోయిన్ సాయిపల్లవి. ఆరంభంలో డాన్సర్ గా చిత్రపరిశ్రమకు పరిచయం అయిన మల్టీటాలెంటెడ్ పర్సన్ సాయిపల్లవి. బాలనటిగా కనిపించటంతో పాటు, డాన్స్ షో ‘ఢీ’ జూనియర్స్ లో పాల్గొంది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు సైతం పోషించింది. అలా ఓ తమిళ చిత్రంలో కంగనా రనౌత్ స్నేహితురాలిగా మెరిసింది. ఆ సినిమా పేరు ‘ధూమ్ ధామ్’. 2008 లో విడుదలైన ఈ సినిమాలో జయం రవి హీరో. కంగన నెచ్చెలిగా దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొందట. పుట్టినరోజున ఆ సినిమాలో కంగన వెనుకగా సాయిపల్లవి ఉన్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తను ఎదిగిన క్రమాన్ని మర్చిపోని నటి సాయిపల్లవి. హీరోయిన్ గా కూడా తనకు నచ్చిన సినిమాలనే చేసుకుంటూ స్టార్ డమ్ అందుకుంది. నచ్చని పని చేయను అని చెప్పటానికి ఏమాత్రం మొహమాట పడదు. స్టార్ హీరోల సినిమాలు సైతం అలా ఎన్నో రిజెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఇక భారీ పారితోషికం ఆఫర్ చేసినా కమర్షియల్ ప్రకటనలలో కనిపించటానికి ఇష్టపడని ఒకే ఒక నటి సాయిపల్లవి. మరి కంగన ఫ్రెండ్ గా సాయిపల్లవి కనిపించిన చిత్రంపై మీరూ ఓ లుక్కేయండి.
కంగనా నెచ్చెలిగా సాయి పల్లవి!?
