Site icon NTV Telugu

Sai Pallavi : సాయి పల్లవి డిసిషన్‌తో.. ఇబ్బందుల్లో శింబు 49వ సినిమా

Saipalavi Shimbu

Saipalavi Shimbu

కోలీవుడ్ స్టార్ శింబు కెరీర్ ఒక దశలో వివాదాల వలన ముగిసిందని అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా వరుసగా అవకాశాలు అందుకుంటూ, హీరోగానూ, కీలక పాత్రల్లోనూ నటిస్తూ తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో అతని 49వ సినిమా కూడా ఫిక్స్ అయింది. దానికి స్టార్ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

Also Read : Sai Dharam Tej : పెళ్లి రూమర్స్‌పై స్పందించిన సాయి ధరమ్ తేజ్..

ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఆ ఆలోచనను మార్చి తాజాగా సాయి పల్లవిను సంప్రదించారని సమాచారం. కథ విన్న సాయి పల్లవి మొదట పాజిటివ్‌గా స్పందించారట. అంతేకాక, హీరో శింబు అని ముందుగానే చెప్పార‌ని తెలుస్తోంది. కానీ మరుసటి రోజు ఆమె ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం హీరో శింబు అని ప్రచారం జరుగుతోంది. వెట్రీమారన్‌తో సినిమా చేయడం ప్రతీ నటికి ఒక కల. గతంలో సాయి పల్లవి కూడా ఆయన సినిమాల్లో నటించాలని బహిరంగంగానే చెప్పిం‌ది. అయినా ఇప్పుడు హీరో కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవడం చర్చనీయాంశమైంది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణం’ లో నటిస్తోంది. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను వదులుకోవడం నిజంగా ఆశ్చర్యంగా మారింది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో, సాయి పల్లవి చివరకు వెట్రీమార‌న్–శింబు సినిమా చేస్తుందో లేదో చూడాలి.

Exit mobile version