Site icon NTV Telugu

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ను లాంచ్ చేసిన సుప్రీం హీరో

Sai Dharam Tej launched Triumph Trident 660 Bike

లేటెస్ట్ బైక్ లపై యూత్ ఎంత మక్కువ చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇక హై పర్ఫార్మెన్స్ బైక్ లు అంటే విపరీతంగా ఇష్టపడతారు. తాజాగా అలాంటి ఓ బైక్ నే లాంచ్ చేశారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. హైదరాబాద్‌లో హై పర్ఫార్మన్స్ బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660ని లాంచ్ చేశారు సాయి తేజ్. బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఆల్-న్యూ ట్రైడెంట్ 660 భారతదేశంలో రూ .6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ట్రిపుల్ సిలిండర్ 660 సిసి ఇంజిన్‌తో 81 పిఎస్ @ 10,250 ఆర్‌పిఎమ్ గరిష్ట శక్తితో, 64 ఎన్‌ఎమ్ @ 6250 ఆర్‌పిఎమ్ టార్క్ కలిగి ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ 660 సిసి, ఇన్లైన్ ట్రిపుల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. టూ రైడ్ మోడ్స్ రోడ్ అండ్ రెయిన్ స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, థొరెటల్-బై-వైర్ వంటి రెండు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ కలిగి ఉంటుంది. ట్రయండ్ మోటార్ సైకిల్స్ ట్రైడెంట్‌తో కొన్ని ఆప్షనల్ యాక్ససరీస్ కూడా అందిస్తున్నాయి. కాగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” చిత్రంలో నటిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఐఎఎస్ అధికారిగా కన్పించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ‘రిపబ్లిక్’ మూవీని జేబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా… ఈ ఏడాది జూన్ 4 చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్ లోని పలు పెద్ద సినిమాలు సైతం విడుదలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version