సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Also Read :Pushpa 2 Stampede Tragedy: : కోలుకోని శ్రీతేజ, సహాయం కోసం తండ్రి ఎదురుచూపు!
ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. బడ్జెట్ తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ గారు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ మణికంఠ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న సినిమాల్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని కూడా చాలా కష్టపడి మంచి సబ్జెక్టు రాసుకొని తీసాడు. మేము కలిసి త్వరలోనే ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది. ఈ సినిమా హీరో చరణ్ లో చాలా మంచి ఈజ్ ఉంది. తన పర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తన కాంబినేషన్లో మరో సినిమా రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ.. ఇది నా ఐదో సినిమా ఇందులో అన్ని పాటలు చేశాను. సిద్దార్థతో పాట పాడించడం మరచిపోలేను. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.
