తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా పురస్కారాన్ని సాధించి, కథాబలం ఉన్న సినిమాలకు మరోసారి ప్రతిష్టను తెచ్చిపెట్టింది.
Read More: Manchu Vishnu: పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
ఈ చిత్రాన్ని ఎన్‌ఆర్‌ఐ మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి నిర్మాణంగా రూపొందించడం విశేషం. తొలి చిత్రంతోనే బలమైన కథను ఎంచుకొని, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో కూడిన కథనాన్ని అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరపైకి తీసుకురావడం ద్వారా, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా చాటారు. ఈ చిత్రానికి అనిల్ క్యాట్జ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు.
Read More: Garuda 2.0 : ఆహా’లో దూసుకుపోతున్న గరుడ 2.౦
ఒక తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు చేసే ఒంటరి పోరాటాన్ని, మిశ్రమ భావోద్వేగాలతో కూడిన హృదయస్పర్శిగా చిత్రీకరించారు.
2024 మే నెలలో థియేటర్లలో విడుదలైన శబరి, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, కథలోని లోతు, భావోద్వేగ పరిణామాలు, ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన మరియు ఆమె చేసిన అసాధారణ పోరాటం వంటి అంశాలు అవార్డ్స్ కమిటీ నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.
