NTV Telugu Site icon

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కు బ్రేక్… కరోనా ఎఫెక్ట్..!

RRR shoot cancelled due to Covid-19 outbreak

దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేక్ పడింది. కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల షూటింగులు కూడా ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకర్స్ ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్‌ను వెంటనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం వందలాది మంది సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టు కోసం పని చేయాల్సి ఉంది. దేశంలో కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంతమందితో షూటింగ్ చేయడం మంచిది కాదనే అభిప్రాయంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొంతభాగం మాత్రమే మిగిలిపోయింది. ఈ స్మాల్ పార్ట్ షూటింగ్ సుమారు 25 రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.