NTV Telugu Site icon

Vishnu Priya: విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి రిలేషన్?

Vishnupriya Rithu Chow

Vishnupriya Rithu Chow

Rithu Chowdary in Relation with Vishnupriya Ex Lover: పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు చౌదరి తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఒకప్పటి యాంకర్ విష్ణు ప్రియతో చాలా స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే విష్ణు ప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తాను రిలేషన్ లో ఉన్నాను అంటూ రీతు చౌదరి బాంబు పేల్చింది. అసలు విషయం ఏమిటంటే శ్రీముఖి యాంకర్ గా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ఒక షో స్టార్ మా లో ప్రసారమవుతోంది.

Kumari Aunty: కుమారి ఆంటీని సన్మానించిన రియల్ హీరో సోనూ సూద్

అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య పోటీ పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కాలేజీ టీం తో ఒక స్కిట్ చేశారు. అందులో భాగంగా రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసి అందరి ముందు చదివింది. అందులో భాగంగానే నీకోసం చేసే కాఫీ తోనే నా రోజు మొదలవ్వాలని లవ్ లెటర్ లో రాస్తే మీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా అని విష్ణు ప్రియ అంటుంది. అయితే మా వాడికి కాఫీ అలవాటు లేదని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆ అబ్బాయిని నీ కంటే ముందు నేనే ప్రేమించాను కాబట్టి అంటూ సరదాగా కామెంట్ చేసింది. దీనితో షోలో ఉన్న వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. అయితే నిజంగా రీతు చౌదరి ప్రియుడిని ఒకప్పుడు విష్ణు ప్రియ ప్రేమించిందా? లేక షోలో స్కిట్ కోసమే ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే గాని ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.

Show comments