Site icon NTV Telugu

Kantara Chapter 1: కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్

Kanthara Prequal

Kanthara Prequal

కన్నడ సినిమా చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం ‘కాంతార’. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి, వరల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రా నేటివిటీ, భక్తి – భయం కలిసిన ఆ విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ రూపంలో ‘కాంతార చాప్టర్-1’ రాబోతోంది.

Also Read : Euphoria : గుణశేఖర్ యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘యుఫోరియా’ అప్ డేట్ ..

ఈ భారీ ప్రాజెక్ట్‌ను రిషబ్ శెట్టి స్వయంగా తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉండగా, మేకర్స్ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం ప్రత్యేక స్ట్రాటజీలు సిద్ధం చేస్తూ, ఆడియన్స్‌లో అంచనాలను ఇంకా పెంచుతున్నారు. అదే సమయంలో ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌తో సినీ ప్రియుల్లో ఉన్న అంచనాలకు ఇంకా పెంచాలని మేకర్స్ చూస్తున్నారు. అయితే తాజాగా..

కన్నడ సినీ ఇండస్ట్రీలో తొలిసారి ప్రీమియర్స్ వేయాలని కాంతార ప్రీక్వెల్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 1న వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీమియర్స్.. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు వేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే అనేక కన్నడ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ, ముందు రోజు ప్రత్యేక ప్రీమియర్ల‌ను ఎప్పుడూ వేయలేదు. కానీ తెలుగు, తమిళ చిత్రాల విజయం చూసి, కాంతార నిర్మాతలు ప్రత్యేక షోలను ప్లాన్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. కాగా, మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Exit mobile version