NTV Telugu Site icon

MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?

Untitled Design (4)

Untitled Design (4)

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు వరుణ్ తేజ్. అప్పుడెప్పుడో వచ్చిన గద్దల కొండా గణేష్ వరుణ్ తేజ్ సోలో కమర్షియల్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఇలా వచ్చి వెళ్లాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు. నూతన దర్శకుడితో చేసిన గని ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.

తాజగా వరుణ్ తేజ్ “మట్కా” అనే సినిమా స్టార్ట్ చేసాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన కరుణా కుమార్ మట్కా కు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్‌ని ముగించింది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై కీలక సన్నివేశాలు తెరక్కెక్కించారు. వాటితో పాటు ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించారు. అలాగే కొన్ని కొన్ని సాంగ్స్ కూడా పూర్తి చేశామని నిర్మాణ సంస్థ తెలిపింది. రారా రక్కమ్మ, జైలర్ లోని నువ్వు కావాలయ్యా టైపులో సాగే సాంగ్ మట్కా నుండి రాబోతుందని యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్ లో ఆ సాంగ్ షూట్ చేసారని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా చేసారని సమాచారం. అతి త్వరలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మట్కా తరువాత షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో శరవేగంగా జరుగుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. హాయ్ నాన్న వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ మట్కా సినిమాను నిర్మిస్తుండగా జీవీ. ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంతో అయినా వరుణ్ తేజ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read :  Kalki: బుక్ మైషోలో ‘బుజ్జి’ గాడు రికార్డు…ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే ..?

Show comments