పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. అయితే ఈ చిత్రం పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తెలియని కారణాలతో ఆఖరి నిమిషంలో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికి సాయి పల్లవి 3 కోట్ల రూపాయలు పారితోషికంగా డిమాండ్ చేశారట. అయితే ఈ బ్యూటీ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట చిత్రంలో. ఆ చిన్న పాత్రకు సాయి పల్లవి అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కువని భావించిన మేకర్స్ ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారట. అంతేకాదు నిత్యామీనన్ ఈ చిత్రాన్ని తక్కువ రెమ్యూనరేషన్ కే ఓకే చేసినట్టు తెలుస్తోంది. నిత్యా ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక సాయి పల్లవి ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగిందనే వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
భారీ రీమేక్ లో సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్… ఎందుకంటే ?
