హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రవితేజ తన తదుపరి చిత్రాని సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తో ఓకే చేసుకున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది.
Also Read : Dulquer Salmaan : OTT లోకి దుల్కర్ సల్మాన్ ‘ఒక యముడి ప్రేమకథ’..
మాస్ మహారాజా రవితేజకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్‌తో పాటుగా, రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్ లో రవితేజ రోల్ యాటిట్యూడ్ ని గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో స్పానిష్ నేర్చుకునే బుక్ ఒక చేతిలో, మరి చేతిలో షాంపైన్ బాటిల్ తో కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలి ఎంటర్‌టైన్నింగ్ సినిమాను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే రవితేజ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. వెంకీ, దుబామ్ శ్రీను, కిక్, కృష్ణ.. ఇలా ప్రతి ఒక్క మూవీలో రవితేజ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా అలాంటి కుటుంబ కథనే రాశారట. ఇక నటీనటుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
