Site icon NTV Telugu

రవితేజ… మలయాళ బ్యూటీతో కలసి ముప్పై ఏళ్లు వెనక్కి!

Raviteja and Sharat Mandava Back to 90's

కమర్షియల్ సినిమాల్లో… అదీ మాస్ హీరోలకి… వెరైటీ ట్రై చేయటానికి పెద్దగా స్కొప్ ఉండదు. అదే పాత చింతకాయ అటు ఇటు మరలేసి వడ్డించాల్సిందే. అలాగని, రొటీన్ సీన్లు, డైలాగ్స్ ఉంటే కూడా ఫ్యాన్స్ రిజెక్ట్ చేస్తారు. అయితే, మాస్ ప్రేక్షకుల్ని బాక్సాఫీస్ వద్ద ఎలా ఏలాలో బాగా తెలిసిన మహారాజా, రవితేజ. తన ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేయకుండానే వీలైనంత వెరైటీకి ఓటేస్తుంటాడు. కొన్ని సార్లు ఆయన సినిమాలు సత్తా చాటకపోయినా చాలా సార్లు హిట్స్ అందుకున్నాడు టాలెంటెడ్ స్టార్…

‘కిక్’ లాంటి చిత్రంతో మంచి రెస్పాన్స్ అందుకున్న రవితేజ నెక్ట్స్ కొత్త డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు. శరత్ మండవ ఆయన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే, డెబ్యూటాంట్ డైరెక్టర్ రొటీన్ కి భిన్నంగా పీరియడ్ డ్రామా ప్లాన్ చేశాడట. 1990వ దశకం తొలినాళ్లలో జరిగిన ఒక యదార్థ ఘటన సినిమా కథకి ఆధారం అంటున్నారు. అందుకు తగ్గట్టే రవితేజ లుక్ కూడా మార్చబోతున్నాడట. అంటే, మాస్ మహారాజా ఫ్యాన్స్ కి 90స్ లోని వింటేజ్ లుక్ తో కొత్త పీల్ కలగటం గ్యారెంటీ అన్నమాట!

రవితేజ, డైరెక్టర్ శరత్ మూవీ ఉగాదికి ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ బాణీలు సమకూర్చే పనిలో ఉన్నాడు. ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కేరళ కుట్టి రాజీషా విజయన్ హీరోయిన్ గా కన్ ఫర్మ్ కావచ్చట. ధనుష్ నటించిన రీసెంట్ మూవీ ‘కర్నన్’లో మలయాళ సుందరే కథానాయిక. చూడాలి మరి, కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్ తో రవితేజ చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో…

Exit mobile version