NTV Telugu Site icon

Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..

Mr Bachchan

Mr Bachchan

Mr Bachchan: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.ఈ ఏడాది ఈగల్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది ట్యాగ్ లైన్ .ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  రవితేజ మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా రవితేజ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్ లో కనిపించి అలరించాడు.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది.. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశాడు.ఈ వీడియోలో హరీశ్ శంకర్‌ వద్దకు రవితేజ హార్డ్ కోర్ ఫ్యాన్ వచ్చి ‘మిస్టర్ బచ్చన్ ‘నుంచి ఏదైనా అప్డేట్ ఇవ్వమని కోరతాడు. దీనికి హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తయింది ఇక అప్‌డేట్‌లే మిగిలి ఉన్నాయి.అందరిలా కాకుండా మనం సరికొత్తగా ప్లాన్ చేద్దాం. ఈసారి ఒక షో రీల్ వదులుదాం.అందులో డైలాగ్స్ లాంటివి ఏమి ఉండవు అంటూ హరీశ్ శంకర్ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments