Raviteja Son Teja: ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతునట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అంతే కాదు దానికి దర్శకుడు పూరీ జగన్ దర్శకత్వం వహిస్తాడని, ‘ఇడియట్ 2’ గా అది తెరకెక్కుతుందనీ వినిపించింది. ఎదుకంటే 20 సంవత్సరాల క్రితం పూరి, రవితేజ కలయికలో వచ్చిన ‘ఇడియట్’తో రవితేజ టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ సినిమా రవితేజ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా నిలిచి పోయింది. అయితే ఈ రూమర్స్ గురించి మీడియా రవితేజ వద్ద ప్రస్తావించింది. దీనిని వదంతిగానే కొట్టిపారేస్తూ తను ఈ రూమర్ గురించి వినడం ఇదే మొదటిసారని, నిజానికి అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని చెప్పేశాడు. మహాధన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, అయితే స్టడీస్ తో పాటు నటన కూడా నేర్చుకుంటున్నాడని వినికిడి. అంతే కాదు యు.ఎస్ వెళ్ళి నటనలో డిప్లొమా, డాన్స్, ఫైట్స్ లో శిక్షణ తీసుకోనున్నాడట. అంటే తన కొడుకును రవితేజ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నాడన్న మాట. మరి మహాధన్ ఎంట్రీ ఎప్పుడు, ఏ దర్శకుడితో, ఏ సినిమాతో మొదలవుతుందో చూడాలి.
Child Missing: పాప మిస్సింగ్ మిస్టరీ.. 24 గంటలు గడుస్తున్నా దొరకని ఆచూకీ