వరుస సినిమాలతో అలరిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక కెరీర్‌కు, ‘యానిమల్’ మూవీ ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే.. అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా రష్మికను.. ఓ ఇంటర్వ్యూలో నిజ జీవితంలో యానిమల్ ల్లో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని ప్రశ్న ఎదురవ్వగా .. ఆసక్తికర సమాధానమిచ్చింది రష్మిక. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇదే ఇంటర్వ్యూలో ఆమె ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు.
Also Read : Peddhi : ‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
“మనం ఎవరినైనా ప్రేమిస్తే.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు. మీ ప్రాణ స్నేహితుడితో కాని, మీ భాగస్వామితోనే కాని కొంతకాలం కలిసి ప్రయాణించాక అకస్మాత్తుగా పాత రోజులను గుర్తుచేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుంది. ఆ మార్పునకు ఒక్కోసారి మీరే ఆశ్చర్యపోతారు” అని చెప్పారు. తాను అర్ధంచేసుకునే భాగస్వామి గురించి మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు.
ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘ధామా’ అనే హారర్ కామెడీలో నటిస్తున్నారు. దీనితో పాటు ‘ది గర్ల్ఫ్రెండ్తో సిద్ధమవుతున్నారు. తాజాగా ‘మైసా’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు అలాగే అట్లీ- అల్లు అర్జున్ సినిమాలోనూ ఈ అమ్మడు కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
