NTV Telugu Site icon

400 ట్రైబల్ కుటుంబాలకు రానా సాయం

Rana Daggubati comes to the rescue of 400 tribal families during the Covid-19

కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మిసాలా భూమన్న గూడెం, గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాలలోని కుగ్రామాలు ప్రజలకు ప్రజలకు కిరాణా సామాగ్రి, మందులు అందించారు. ఇక రానా వర్క్ విషయానికొస్తే… “అరణ్య”తో కరోనా సమయంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. పవన్ కళ్యాణ్ తో “అయ్యప్పనమ్ కోషియం” తెలుగు రీమేక్, వేణు ఉడుగుల “విరాటా పర్వం” చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా భారీ విఎఫ్ఎక్స్ తో అతీంద్రియ శక్తుల నేపథ్యంలో మిలింద్ రౌ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రానా.