NTV Telugu Site icon

Ramnagar Bunny : ఆసక్తికరంగా రామ్ నగర్ బన్నీ టీజర్.. చూశారా?

Ramnagar Bunny

Ramnagar Bunny

Ramnagar Bunny Teaser: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ్ల నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న “రామ్ నగర్ బన్నీ” సినిమా అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చంద్రహాస్ మాట్లాడుతూ – రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు ప్రతి ఒక్కరం టీమ్ వర్క్ చేశాం. హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. నలుగురు హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను డ్యాన్స్ లు బాగా చేశానని అంటున్నారు. ముందుగా బాగా ప్రాక్టీస్ చేయడమే స్క్రీన్ మీద మంచి ఔట్ పుట్ తీసుకొచ్చింది.

Suicide: పెళ్లై 7 ఏళ్లు.. పిల్లలు పుట్టడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య

మ్యూజిక్ మా మూవీకి మరో ఆకర్షణ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ హిట్ సాంగ్స్ చేశాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారికి, డ్యాన్స్ మాస్టర్స్ కు, సినిమాటోగ్రాఫర్ అష్కర్ అలీకి అందరికీ థ్యాంక్స్. నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్..ఇలా హీరోలంతా ఇష్టమే. ఎన్నో గొప్ప క్వాలిటీస్ వారిలో ఉన్నాయి. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని నటిస్తా. రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను ఏ భాషలో చూసినా సబ్ టైటిల్స్ వేస్తే చాలు ఎంజాయ్ చేస్తారు. అన్నారు. చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Show comments