Site icon NTV Telugu

Game Changer Vs Pushpa 2 : రాంచరణ్, అల్లు అర్జున్ మధ్య తీవ్ర పోటీ తప్పదా..?

Allu Arjun Vs Ramcharan

Allu Arjun Vs Ramcharan

Game Changer Vs Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ముందుగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ చూసారు కానీ షూటింగ్ డిలే అవ్వడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే పుష్ప 2 ను డిసెంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అయింది.ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.

Read Also :Game Changer : రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్లో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాను దిల్ రాజు అక్టోబర్ లో రిలీజ్ చేస్తారా లేక డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా అనేది ప్రశ్నగా మారింది .డిసెంబర్ లో కనుక రిలీజ్ చేస్తే పుష్ప 2 సినిమాతో తీవ్ర పోటీ ఎదురయ్యే ఛాన్స్ వుంది .ఇప్పటికే అల్లు అర్జున్ ,మెగా ఫ్యాన్స్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.ఈ ఎన్నికలలో అల్లుఅర్జున్ వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఈ రచ్చ మొదలైంది.ఇప్పుడు అల్లుఅర్జున్ ,రాంచరణ్ సినిమాలు డిసెంబర్ లోనే వస్తే కనుక రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ తప్పదనే వాదన వినిపిస్తుంది.

Exit mobile version