NTV Telugu Site icon

RamaJogayya Sastry : ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..’అని’ అదరగొడతాడు..

Whatsapp Image 2024 05 18 At 8.19.36 Am

Whatsapp Image 2024 05 18 At 8.19.36 Am

RamaJogayya Sastry : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ “జాన్వికపూర్” ఈసినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.దేవర సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కనుక ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి “ఫియర్ సాంగ్” ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సాంగ్ ను ఎన్టీఆర్ బర్త్ డే కు ఒక రోజు ముందు అంటే మే 19 న విడుదల చేయనున్నారు.ఈ సాంగ్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా వున్నారు.ఇప్పటికే నిర్మాత నాగవంశీ దేవర సాంగ్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఈ పాట విన్నాక జైలర్ మూవీ సూపర్ హిట్ సాంగ్ “హుకుం”ను మర్చిపోతారు అని నాగ వంశి తెలిపారు. ఇదిలా ఉంటే స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేస్తూ ఇంకొక్క రోజు ఓపిక పట్టండి అబ్బా మన “అని”…అబ్బా…వర్తు వెయిటింగ్ “అని”పిస్తాడు…మనందరినోట..అని ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Show comments