భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రామ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్”గా ఊర మాస్ గెటప్ తో భారీ మాస్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత రామ్ “రెడ్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఈ యంగ్ హీరో సినిమాలను బాలీవుడ్ లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. రామ్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా రామ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ఇతర భాషల్లోకి డబ్ చేయబడుతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన “ఉప్పెన” ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ మూవీ రామ్ పోతినేని తన కెరీర్‌లో 19వ చిత్రం కానుంది. ఆ తరువాత రామ్-మురుగదాస్ కాంబినేషన్ లో మరో ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సుమారు రూ .10 కోట్ల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రామ్ తన మార్కెట్ పరిధిని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ రెండు చిత్రాలపైనే రామ్ ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాలు హిట్ అయితే రామ్ కెరీర్ మరో కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- Tags
తాజావార్తలు
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!