వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ ఇటీవలే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పిక్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు… అల్లు అరవింద్ కొడుకు… అల్లు సార్ మీ కి జోహార్” అంటూ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు శిరీష్ పై చేసిన ఈ ట్వీట్ పై ‘ఎవర్ని వదలరా సర్?, ట్వీట్లు పెట్టడంలో మిమ్మల్ని మించిన వారే ;లేరు గురూ’ అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన దెయ్యం, డి కంపెనీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. మరోవైపు మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
