Site icon NTV Telugu

“ది ఫ్యామిలీ మ్యాన్-2″పై ఆర్జీవీ రివ్యూ

Ram Gopal Varma review on The Family Man 2

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా హీరోయిన్లతో ఉన్న హాట్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” రివ్యూ ఇచ్చారు. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సెలెబ్రిటీల నుంచి ప్రేక్షకుల దాకా నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ “ఫ్యామిలీ మ్యాన్ 2″పై తన రివ్యూను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. “ఫ్యామిలీ మ్యాన్ 2″ ఒక వాస్తవిక జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీకి దారి తీస్తుంది. ఇది ఎప్పటికీ కొనసాగవచ్చు .ఫ్యామిలీ డ్రామా / యాక్షన్ / ఎంటర్టైన్మెంట్ లను కలపడం కష్టమైనది. మనోజ్ బాజ్‌పేయ్ వంటి అద్భుతమైన నటుడి ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అతను వాస్తవిక, నాటకీయ మధ్య చాలా చక్కని గీతను నడుపుతాడు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇందులోని మిగతా నటీనటులు సమంత, ప్రియమణి తదితరుల గురించి ఆయన ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనార్హం.

Exit mobile version