ఎన్టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా న్యూస్, థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న మీడియా పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్ చేశారు. నా న్యూస్ బెటర్ గా ఉండాలి నా థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలి అని అనుకునే కాంపిటీషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. అప్పుడే జనం అట్రాక్ట్ అవుతారు అనే ప్రపంచంలో మనం ఉన్నాం అని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా ఇండియాలో జరుగుతున్న విషయం మాత్రమే కాదు అమెరికాలో కూడా అదే జరుగుతోంది.
RGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?
సోషల్ మీడియా అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రపంచంగా క్రియేట్ అయిపోయింది అని అన్నారు. మీ మీద పెట్టిన కేసు ఎంతవరకు నిలబడుతుందని భావిస్తున్నారు అని అడిగితే నేను పెట్టిన ట్వీట్ వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారు. అయితే వన్ ఇయర్ తర్వాత దాన్ని ఎందుకు చూశారు అనేది ఒక పాయింట్. ఇలాంటి ట్వీట్ల మీద కేసు పెట్టిన తర్వాత మరో ముగ్గురు నలుగురు చూసి మళ్ళీ కేసులు పెడుతున్నారు. నేను వన్ ఇయర్ బ్యాక్ పెట్టినప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఏ చానల్స్ అయితే మాట్లాడుతున్నాయో ఆ సో కాల్డ్ మీడియా కూడా వాటిని అప్పుడు నోటీస్ చేయలేదు. అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.