పెద్దిలో రామ్ చరణ్ లుక్ బయటకు రాగానే.. సుకుమార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రంగస్థలంలో చిట్టిబాబు రోల్‌తో పోల్చారు ఆడియన్స్. అలాగే పుష్పలో బన్నీ లుక్‌లా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు గురువు సుకుమార్‌నే డైరెక్టర్ కావడంతో.. అదే మీటర్‌లో బుచ్చిబాబు కొట్టుకుపోతున్నాడన్న ఓపెన్ కామెంట్స్ వినిపించాయి. కానీ పెద్ది గ్లింప్స్ ఇలాంటి కామెంట్లకు కాస్త చెక్ పెట్టినట్లయింది. కానీ మళ్లీ వీటికి తెర లేపాడు బుచ్చిబాబు.
Also Read:Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?.. అసలు కారణం ఇదే!
గేమ్ ఛేంజర్ కోసం బల్క్‌గా డేట్స్ ఇచ్చి మరో చిత్రానికి కమిట్ అవ్వని రామ్ చరణ్.. శంకర్ మూవీ కంప్లీట్ కాగానే ఉప్పెనతో ఫ్రూవ్ చేసుకున్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ ఎనౌన్స్‌మెంట్ అయిన ఈ మూవీ ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ కాగా, తాజా షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి. పెద్ది కోసం రామ్ చరణ్ మేకోవర్ అయిన పిక్స్ రీసెంట్‌గా రిలీజ్ కాగా.. ఈ సారి థియేటర్లు తగలబడిపోతాయంతే అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Also Read:Dulquer Salmaan : దుల్కర్ తో సినిమా మొదలెట్టిన దసరా నిర్మాత
ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో.. స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్దిలో ఓ ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి. మా ఊరి ప్రెసిడెంట్ అంటూ శ్రీకాకుళం యాసలో సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నాడట. తనదైన స్టైల్‌లో మ్యూజిక్‌తో ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ చేయబోతున్నాడని టాక్. ఉత్తరాంధ్ర ఫోక్ సింగర్ పెంచల్ దాస్ పాడినట్లు తెలుస్తోంది. ఈ ఫోక్ సాంగే సుకుమార్ హైలైట్ అయ్యేలా చేసింది. రంగస్థలంలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ జిగేల్ రాణిని రీమిక్స్ చేశాడు సుక్కు. ఇప్పుడు బుచ్చి కూడా ఇదే ఫాలో అవుతుంటే.. గురువును కాపీ కొడుతున్నాడని, రంగస్థలం నుండి సుక్కు బయటకు వచ్చినా.. బుచ్చి రాలేకపోతున్నాడా అనే డౌట్స్ కలుగుతున్నాయి. జిగేల్ రాణిగా పూజా హెగ్డే మెప్పించగా.. మరి పెద్ది కోసం బుచ్చి ఆమెనే పట్టుకొస్తాడో…? లేక స్పెషల్ సాంగ్స్ చేసిన ముద్దుగుమ్మల్ని సెలక్ట్ చేస్తాడో లెట్స్ వెయిట్..
