Site icon NTV Telugu

Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్

Ramcharan Peddi

Ramcharan Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా “పెద్ది” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఈవెంట్‌లో ఎమోషనల్‌గా మారారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ షోలో చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సాన్నిధ్యం వహించగా, అక్కడ “పెద్ది” సినిమా టీమ్ ఉత్సాహంగా కనిపించింది. ఈ వేడుకలో రెహమాన్ తన అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. “యువ” సినిమాలోని “జన గణ మన” పాటతో ప్రారంభమైన ఈ లైవ్ కాన్సర్ట్‌ “రోజా”, “రంగ్ దే బసంతి”, “ఫనా”, “ప్రేమదేశం”, “ఏ మాయ చేశావే” లాంటి ఎవర్‌గ్రీన్ హిట్స్‌తో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..

Also Read : Tamannaah special song: తెలుగులో మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా

“నేను చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతానికి పెద్ద అభిమాని. ఆయన ట్యూన్స్‌లో ఒక సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో కలగంటున్నా. ఆ కల ఇప్పుడు ‘పెద్ది’తో నెరవేరింది. రెహమాన్ మ్యూజిక్‌లో భాగమవడం నా కెరీర్‌లో ఒక గోల్డెన్ మోమెంట్ లాంటిది” అని ఎమోషనల్‌గా తెలిపారు. ఆయన మాటలు విన్న అభిమానులు, సంగీత ప్రేమికులు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ‘పెద్ది’ చిత్రంలోని “చికిరి చికిరి” సాంగ్‌ను రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ లైవ్‌లో ఆలపించడం ఆ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాటకు చరణ్, జాన్వీ స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంతో వేదిక సందడిగా మారింది. ఇక..

ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. “నా సంగీత ప్రయాణం తెలుగుతోనే ప్రారంభమైంది. ఇళయరాజా గారు, ఎంఎస్ విశ్వనాథన్ గార్లతో పని చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సంగీతాన్ని ప్రేమతో ఆలకిస్తారు” అని అన్నారు. తొలిసారిగా ఓ పంజాబీ భంగ్రా సాంగ్‌ని ఆలపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన రెహమాన్ షోలో శ్వేతా మోహన్, రక్షిత సురేశ్, ఎవెలిన్ సోటో, రంజిత్ బరోట్, అలీఫ్ హమ్దాన్ తదితర గాయకులు కూడా తమ అద్భుత ప్రదర్శనతో హడావుడి చేశారు. మొత్తానికి, ఈ వేడుకలో రామ్ చరణ్ – రెహమాన్ కలయికతో “పెద్ది” సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. చరణ్ చెప్పినట్టుగానే, ఈ సినిమా ఆయన కల నెరవేర్చిన స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version