2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈ రోజు 18 సంవత్సరాల మైలురాయిని తాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రెకగ్నిషన్ తెచ్చుకున్నాడు. రామరాజు గా కనిపించి హాలీవుడ్ వరకు మెప్పించాడు.
Also Read : Mega Family: చిరు ఫ్యామిలీలో మరో శుభవార్త.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న మెగా హీరో !
చరణ్ సినీ ప్రస్థానంలో 18 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా, ఆయన తాజా చిత్రం పెద్ది నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఒక్కటే ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రైల్వే ట్రాక్ మీద ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్‌ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీ పట్టుకుని.. ఆ ఇంటెన్స్ లుక్‌లో రామ్ చరణ్ కనపడగానే సోషల్ మీడియా మొత్తం ఫుల్ హైప్ అయింది. దీంతో అభిమానులు.. “18 ఏళ్ల క్రితం చిరుత.. ఈరోజు పెద్ది.. మా హీరో జర్నీకి మేము గర్వపడుతున్నాం”,“రామ్ చరణ్ మాస్, క్లాస్ రెండింట్లోనూ కంఫర్ట్‌గా రాణించగల ఏకైక హీరో”,“ఈ పోస్టర్ చాలు.. సినిమా ఎంత రా అండ్ ఎమోషనల్‌గా ఉంటుందో అర్థమవుతోంది”, అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌కి నవీన్ నూలి వంటి అగ్రశ్రేణి టెక్నీషియన్లు పని చేస్తున్నారు. మార్చి 27, 2026. అదే రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ రోజే పెద్ది గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
