ఫిట్‌నెస్ క్వీన్‌గా, గ్లామరస్ హీరోయిన్‌గా, సీరియస్ పెర్ఫార్మర్‌గా మూడు కోణాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆమె, ఇటీవల తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఆర్మీ నేపథ్యమున్న కుటుంబంలో పెరిగిన రకుల్ చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు మారాల్సి వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Also Read : The Raja Saab : ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలు.. ఫస్ట్ సింగిల్ డేట్ ఔట్”
“నేను బాల్యంలో దాదాపు 10 పాఠశాలలు మారాను. అదే అనుభవం నాకు జీవితంలో ఎక్కడికెళ్లినా సర్దుకుపోయే గుణం ఇచ్చింది. కొత్త సంస్కృతులు, కొత్త వ్యక్తులతో చాలా త్వరగా కలిసిపోయే అలవాటు ఏర్పడింది. ఇవే నేటి రకుల్‌గా నిలబడటానికి నాకు తోడ్పడ్డాయి” అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా, సినిమా షూటింగ్‌ల కారణంగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం అనిపించదని రకుల్ చెప్పింది. “కుటుంబ సభ్యులు మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే బాల్యం నుంచే ధైర్యం, బలమైన మనస్తత్వం, స్వతంత్రంగా నిలబడే నైపుణ్యం నేర్చుకున్నాను. ఆ అనుభవాలే నన్ను ఈ రోజు ప్రతి పరిస్థితిలో బలంగా నిలబడేలా చేశాయి” అంటూ ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం రకుల్ అజయ్ దేవగణ్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే ‘మేరే హస్బెండ్ కీ బివీ’తో ప్రేక్షకులను అలరించిన ఆమె, మరోసారి పెద్ద హిట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మొత్తానికి, రకుల్ చిన్ననాటి అనుభవాలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాకుండా, జీవిత పాఠాలు గా మారి ఆమెను మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
