దర్బార్, పేట, కాల ఇలా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ హిట్ తో మళ్లీ రజనీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ ఆ తర్వాత వచ్చిన లాల్ సలాం, వెట్టియాన్ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఇప్పుడు రజనీకి హిట్ట చాలా అవసరం. ఆ నేపథ్యంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తో ‘కూలి’ సినిమా చేస్తున్నాడు రజనీ. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నెక్ట్స్ ఇయర్ మేడేకు మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.
Also Read : Vikrant Massey : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..
కూలీ తో పాటు జైలర్ హిట్టు తర్వాత మళ్లీ రజనీ కోసమే వెయిట్ చేస్తున్నాడు నెల్సన్. మరోసారి రజనికి బ్లాక్ బస్టర్ హిట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు నెల్సన్. అందుకే జైలర్ సీక్వెల్ పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. రీసెంట్లీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ అప్ డేట్ గురించే జైలర్‌లో రజనీ కోడలిగా నటించిన మీర్నా మీనన్ కూడా సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చినట్లు టాక్. రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 12న మూవీ ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. జైలర్ సీక్వెల్‌కు హుకుం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. జైలర్‌లో క్యామియో రోల్స్ గా అదరగొట్టిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్.. సీక్వెల్లో కనిపించబోతున్నారని గట్టి బజ్ నడుస్తోంది. అలాగే మాజీ అల్లుడు ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. రమ్య కృష్ణ పాత్రలో మరొకరు కనిపించనున్నారని తెలుస్తోంది.