Site icon NTV Telugu

‘రాజముడి రైస్’ను వాళ్ళు తప్పకుండా తినాలి… పూరీ మ్యూజింగ్స్ మళ్ళీ స్టార్ట్

RAJAMUDI RICE Puri Musings by Puri Jagannadh

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ పూరీ మ్యూజింగ్స్ ను స్టార్ట్ చేశారు. పూరీ మ్యూజింగ్స్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘రాజముడి రైస్’ ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేశారు. ‘ఇండియాలో రైస్ ముఖ్యమైన ఆహరం. బాస్మతి, అన్నపూర్ణ, చంప, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనామసూరి, జాస్మిన్, సురేఖ,… ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఒకప్పుడు ఇండియాలో ఒక లక్ష వెరైటీ రైస్ ఉండేవి. ఒక రకం రైస్ ను పండించే రైతు చనిపోతే అది ప్రపంచంలో నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు దాన్ని పండించరు. పిల్లలు మర్చిపోతే అంతే. అలా ఎన్నో రకాల వెరైటీ రైస్ మాయం అయిపోయాయి. తరువాత 40,000ల రకాల రైస్ మిగిలాయి. గత 50 ఏళ్ళలో అవి కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు 6,000ల రకాల రైస్ మాత్రమే ఉన్నాయి. అందులో ‘రాజముడి’ రైస్ అనే రకం గురించి మీకు చెప్పాలి. కర్ణాటకలో పూర్వం పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే అంత వాల్యూ ఉండేది ఆ రైస్ కు. విజయ్ రామ్, రామ్ బాబు అనే ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు. వారిద్దరూ వ్యవసాయం గురించి ఎన్నో ఏళ్ళు రీసెర్చ్ చేశారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. డయాబెటిక్ పేషంట్స్, ఆడవాళ్లు ముఖ్యంగా ఈ రైస్ తినాలి” అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పూర. పూరీ ఇంకా ఏం చెప్పాడో మీరూ వినండి.

Exit mobile version