NTV Telugu Site icon

Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్

Untitled Design (5)

Untitled Design (5)

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు .

ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని “పురుషోత్తముడు” సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ సమక్షంలో లాంఛ్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ ” మా సినిమా ట్రైలర్ కు అతి తక్కువ టైమ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా “పురుషోత్తముడు” సినిమా ఈ నెల 26న మీ ముందుకు రాబోతోంది. “పురుషోత్తముడు” థియేటర్స్ లో ఒక పండగ లాంటి వాతావరణం తీసుకొస్తుందని, మీ అందరి ఆదరణ సినిమాకు దక్కుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టగా అనేక వివాదాలు రాజ్ తరుణ్ణి చుట్టుముట్టినట్లయ్యాయి. ఇన్ని వివాదాల నడుమ పురుషోత్తముడు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రాజ్ తరుణ్ సిద్ధం అవ్వడం గమనార్హం. ఈ చిత్ర టైటిల్ లాగే తమ హీరో కూడా పురుషోత్తముడుగా ఈ కేసుల నుండి బయటపడతాడని రాజ్ అభిమానులు ఆశిస్తున్నారు.

Show comments