Raale Puvve Song From Average Student Nani Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. రెండో ప్రాజెక్టుతో ఆయన హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 2న థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు.
Rashmika Mandanna: ఇండియన్ ఐడల్ 3 స్పెషల్ గెస్టుగా రష్మిక
ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు. రాలే పువ్వే అంటూ సాగుతున్న పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు, హీరోయిన్లు స్నేహా, సాహిబా అందాలకు కుర్రకారు ఫిదా అవ్వడం గ్యారంటీ అని చెప్పచ్చు. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.