ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి నటీ నటులుగా జయశేఖర్ కల్లు. దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం “రాబందు”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ అభినందనలు తెలియచేశారు. అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి ప్ర్రీతి నిగమ్ టీజర్ లాంచ్ చేశారు.ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read :Delhi Car blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్‌తో జైషే మహ్మద్‌కు సంబంధం.?
అనంతరం నటి ప్ర్రీతి నిగమ్ మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. అంత బాగా ఉంది. రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో మంచి సినిమా తీసిన ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి ఆదరించండి. అప్పుడు మీ జడ్జిమెంట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్ కలుగుతుందని కచ్చితంగా చెప్పగలను అన్నారు .
