మొహాలు చూపించకుండా సినిమా తీయడం అనేది ఇదివరకు వరల్డ్ వైడ్‌గా ఎవ్వరూ సాహసం చేయని ఓ జానర్. ఇలా ఆర్టిస్టుల్ని చూపించకుండా, అసలు ఎవ్వరూ కనిపించకుండా సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఓ విభిన్న ప్రయత్నం చేస్తూ తీసిన సినిమానే ‘రా రాజా’. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ మాతృ సినిమాతో నిర్మాతగా మారాను. అయితే ఆ సినిమా టైంలోనే నాకు ఈ ‘రా రాజా’ ఆలోచన వచ్చింది. అలా నేనే నిర్మాతగా, దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను అన్నారు.
మొహాలు చూపించకుండా సినిమా తీయడం అనే ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే ప్రస్తుతం ఆడియెన్స్ ఎవ్వరూ కూడా హీరో హీరోయిన్ల పేర్లు, మొహాలు చూసి సినిమాలకు రావడం లేదు. ట్రెండ్ మారింది. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటేనే మూవీని చూస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్, కథా ప్రాథాన్యమున్న చిత్రాన్ని తీయాలని అనుకున్నాను. అందుకే ఈ ‘రా రాజా’ని ప్రారంభించానని అన్నారు. ఆర్టిస్టులెవ్వరూ కనిపించని ఈ ‘రా రాజా’ ఎలా ఉండోబోతోంది అని అడిగితే సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనిపించకపోయినా అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆడియెన్స్ ఫీల్ అవుతారు. లవ్, కామెడీ, హారర్ ఇలా ప్రతీ ఒక్కటీ ఇందులో ఉంటుంది. ఆద్యంతం అలరించేలా, అందరినీ చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుందని అన్నారు.