Site icon NTV Telugu

ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్!

PV Narasimha Rao Biopic on NTR Films Banner

బహుభాషా కోవిదుడు, అసాధారణ రాజకీయనేత, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పి.వి.నరసింహరావు బయోపిక్ తెరకెక్కునుంది. ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో దీనిని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకు ముందు శ్రీహరితో ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించారు. పలు విప్లవాత్మక చిత్రాలతో పాటు, వంగవీటి మోహన రంగ, రాధా జీవిత సంఘటనలతో గతంలో ‘చైతన్యరథం’ చిత్రం రూపొందించిన ధవళ సత్యం ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

Read Also : బాలకృష్ణతో మూవీ… స్పందించిన మెహ్రీన్

తెలుగు, హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లో జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి. నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని, ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆకాంక్ష.

Exit mobile version