NTV Telugu Site icon

Pushpa 2 : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే..?

Pushpa 2

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : BachhalaMalli : గమ్యం, నాందిలా బచ్చల మల్లి సూపర్ హిట్ అవుతుంది: అల్లరి నరేష్

తాజాగా పుష్ప 2 సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మొత్తంగా 3 గంటల 20 నిమిషాలు రన్ టైమ్ తో వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా నవంబర్ 29 అనగా శుక్రవారం ముంబై లోమద్యాహ్నాం 2.00 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 30 శనివారం చిత్తూరు లో భారీ ఎత్తున చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పైతర్జన భర్జనలు జరుగుతున్నాయి. దాదాపుగా లేనట్టే అని టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మొదట యూసఫ్ గూడాలో చేసేందుకు నిర్ణయించిన అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఇటీవల కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్, ఈ సినిమాలో మరొక సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5 న 12000 థియేటర్ లలో రిలీజ్ కానుంది.

Show comments