అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Allu Read : Darshi : సారంగపాణి జాతకం టీజర్ ఔట్.. హిట్టు కళ కనిపిస్తోంది!
పుష్ప 2 కేరళ సెలెబ్రేషన్స్ అటు టాలీవుడ్ ను అలాగే మాలీవుడ్ ను ఆశ్చర్య పరుస్తుంది. మల్లు అర్జున్ ( కేరళలో అల్లు అర్జున్ ను ఫ్యాన్స్ అలాగే పిలుస్తారు) సినిమా అంటే తమ సినిమా అని అర్ధం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు గా 100 కు పైగా తెల్లవారుజామున 4: 00 గంటలకు ప్రదర్శించేలా ఫ్యాన్స్ షోస్ భారీగా ప్లాన్ చేసారు. కేరళలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఇతర హీరోల ఫాన్స్. మామూలుగానే అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో మంచి కలెక్షన్స్ వస్తాయ్. గతంలో వచ్చిన అలా వైకుంఠపురం, సరైనోడు, పుష్ప ఆ విషయాన్నీ ప్రూఫ్ చేశాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా భారీ క్రేజ్ తో ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని హైప్ తో వస్తున్న పుష్ప -2 కు ఆకాశమే హద్దు అన్నట్టు సెలెబ్రేషన్స్ చేస్తున్నారు మల్లు అర్జున్ ఫాన్స్, ఇవన్నీ చూస్తుంటే కేరళలో పుష్ప 2 ఓపెనింగ్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.