NTV Telugu Site icon

Jathara Song Full Video: జాతర సాంగ్ వీడియో వచ్చేసింది భయ్యా.. చూశారా?

Gango Renuka Thalli

Gango Renuka Thalli

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ లో ఒకటైన జాతర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకే సీక్వెన్స్ లో సాంగ్, ఫైట్ ఎమోషనల్ సీన్ ఇలా ఈ జాతర ఎపిసోడ్ అనేది సినిమా మొత్తానికి ఒక హైలెట్గా నిలిచింది. ఇక ఇప్పుడు గంగో రేణుక తల్లి అంటూ సాగుతున్న ఈ సినిమా జాతర సాంగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి
YouTube video player

Show comments