NTV Telugu Site icon

Pushpa 2: రిలీజ్ కి ముందే పుష్ప 2 సరికొత్త రికార్డ్

Pushpa 2 Update

Pushpa 2 Update

బాక్సాఫీస్ లెక్కలు మార్చేందుకు ఫిక్స్ అయ్యాడు పుష్ప రాజ్. ఎవరెస్ట్ తలపించే హైప్.. నార్త్ బెల్ట్‌లో క్రేజ్.. టీంకి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కల్ట్ మేనియాకు పుష్ప 2పై ఎక్స్ పర్టేషన్స్.. స్కైని దాటేస్తున్నాయి. కానీ అంతకన్నా బిగ్ టార్గెట్స్ పుష్ప2కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్..! విచారణ రేపటికి వాయిదా..

అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. అడ్వాన్స్ బుకింగ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ డిసైడ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ రేట్, ఆక్యుపెన్సీ ఓపెనింగ్స్.. వసూళ్లపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే రిలీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డు సెట్ చేసినట్టు యూనిట్ పాటించింది. ఇప్పటికే కేవలం అమెరికాలోనే 2 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా రిలీజ్ కి ముందే ఏకంగా 100 కోట్లు రావడంతో సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్టు అయింది.

Show comments