Site icon NTV Telugu

Puri : మొన్న చిరంజీవి, నేడు నాగ్?

Puri Jaganath

Puri Jaganath

పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ సినిమా ఆయనను భారీ నష్టాలపాలు చేయగా ఈ మధ్యకాలంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి ఏమిటి? ఆయన తరువాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది అంతు పట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఆయనతో ఇప్పుడు వాళ్లు ఎవరూ సినిమాలు చేయడానికి రెడీగా లేరు. మిగతా వాళ్ళందరూ పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా వెళ్లిపోయాడు.

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్

ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందంటే అది యంగ్ హీరోస్. వాళ్లు కూడా ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే చేస్తారా? లేదా? అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూల్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తర్వాత కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాని కూడా పర్యవేక్షించాలి కాబట్టి ఇప్పుడు పూరితో సినిమా చేయడం కష్టమే. ఈ క్రమంలో గోపీచంద్ గోలీమార్ సీక్వెల్ వార్తతో పాటు ఆయన మెగాస్టార్ చిరంజీవికి కథ చేప్పేందుకు సిద్ధం అవుతున్న వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే పూరీ నాగ్ కి ఒక కథ చెప్పగా అది నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని రమ్మన్నారు. చూడాలి ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో, లేదో!

Exit mobile version