NTV Telugu Site icon

నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి మృతి

Producer Sridhar Reddy Passed Away

ప్రముఖ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. చిత్రపరిశ్రమపై మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా మారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో ‘సోగ్గాడి కాపురం’…. వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ సినిమాలు నిర్మించారు. సహృదయులైన శ్రీధర్ రెడ్డి లేని లోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు తెలుగు చిత్ర ప్రముఖులు.