టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి ‘ది దేవరకొండ ఫౌండేషన్’, ‘మిడిల్ క్లాస్ ఫండ్’ అనే రెండు చారిటీ సంస్థలను స్థాపించిన విషయం తెలిసిందే. ‘మిడిల్ క్లాస్ ఫండ్’ చారిటీ సంస్థ ద్వారా మిడిల్ క్లాస్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా ఎంతోమందికి సాయం అందిస్తున్నారు. వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్-బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2020ను గెలుచుకున్న కిక్ బాక్సర్ గణేష్ అంబారి కూడా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ నుంచి రూ.25,000 విరాళంగా అందుకున్నవాడే. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత గొట్టిముక్కెల పాండు రంగరావు “ది దేవరకొండ ఫౌండేషన్” కోసం 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. విజయ్ ను పాండు రంగరావు ఫ్యామిలీతో పాటు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘దేవరకొండ ఫౌండేషన్’కు నిర్మాత పాండు రంగారావు విరాళం
